అక్షరటుడే, ఆర్మూర్: బ్యాంకులో చెక్కు ద్వారా డబ్బులు విత్ డ్రా చేసేందుకు వచ్చిన ఓ వృద్ధుడిని గుర్తు తెలియని వ్యక్తి మాయమాటలతో మోసగించాడు. ఈ ఘటన నందిపేటలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకులో తన్నురి నాగన్న అనే వృద్ధుడు నగదు డ్రా చేసేందుకు చెక్కు తీసుకుని రాగా, గమనించిన ఓ వ్యక్తి అతని వద్దకు వచ్చి.. తనకు క్యాషియర్ తెలుసని, డబ్బులు త్వరగా డ్రా చేసి ఇస్తానని నమ్మించారు. నాగన్న వద్ద ఉన్న చెక్కును తీసుకుని రూ.26వేలు డ్రా చేసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.