అక్షరటుడే, కామారెడ్డి : బైక్​ను ట్రక్​ ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన సదాశివనగర్​ మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన లింగాపూర్​ రవికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నలుగురు బైక్​పై బంధువుల ఇంటికి వెళ్లి శనివారం ఉదయం స్వగ్రామానికి బయలు దేరారు. సదాశివనగర్​లోని అయ్యప్ప ఆలయం వద్దకు రాగానే వెనుక నుంచి వస్తున్న ఓ ట్రక్కు వీరి బైక్​ను ఢీకొంది. ప్రమాదంలో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య లావణ్య, కొడుకు హర్షత్​కు తీవ్ర గాయాలు కాగా కూతురు అన్వికకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను అంబులెన్సులో జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.