అక్షరటుడే, బాన్సువాడ: రెండు బైక్​లు ఎదురెదురుగా ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన గైని సాయిలు(27) వర్ని మండలం పైడిమల్ గ్రామానికి వెళ్తుండగా మరో బైక్​ ఢీకొంది. దీంతో సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వాహనంపై ఉన్న వ్యక్తికి సైతం గాయాలయ్యాయి.