అక్షరటుడే, కోటగిరి: రెండు బైకులు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన కోటగిరి మండలం ఎత్తోండ రోడ్డు వాగు వద్ద చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. బుధవారం సాయంత్రం ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొనడంతో కోటగిరి గ్రామానికి చెందిన ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.