అక్షరటుడే, కామారెడ్డి: అంత్యక్రియలకు ట్రాక్టర్​లో కట్టెలు తెస్తుండగా బోల్తాపడి 8 మందికి గాయాలైన ఘటన భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి శివారులో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. భిక్కనూరు మండలం కాచాపుర్ గ్రామంలో ఓ వ్యక్తి మృతి చెందగా అంత్యక్రియల కోసం కట్టెలు తెచ్చేందుకు ట్రాక్టర్​లో కొంతమంది పెద్దమల్లారెడ్డి శివారుకు వెళ్లారు. కట్టెలతో తిరిగి వస్తుండగా ట్రాక్టర్ బోల్తాపడి 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి సీరియస్​గా ఉన్నట్లుగా సమాచారం. పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.