అక్షరటుడే, బాన్సువాడ: అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బాన్సువాడలో చోటుచేసుకుంది. పట్టణంలోని మంగలి రాజు(50) హెయిర్ కటింగ్ సెలూన్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఎల్లయ్య చెరువు కట్టపై చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పులు ఎక్కువ అవడంతో బలవన్మరణానికి పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.