అక్షరటుడే, ఇందూరు: నగరంలోని దుబ్బ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిపై ఉపాధ్యాయురాలు చేయి చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పదో తరగతి విద్యార్థిని అశ్వితను నాలుగు రోజుల క్రితం ఉపాధ్యాయురాలు తీవ్రంగా కొట్టడంతో చేయి విరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యాశాఖ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు. ఘటనపై విద్యాశాఖ అధికారులను సంప్రదించగా.. ఉపాధ్యాయురాలు చేయి విరిగేలా కొట్టలేదని, కాస్త మందలించిందని చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.