అక్షరటుడే, బాన్సువాడ: బీర్కూరు మండలం రైతునగర్లో క్షుద్ర పూజల ఘటన కలకలం ఆదివారం రేపింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో కొంత మంది ఇళ్ల ముందు రాత్రి సమయంలో నిమ్మకాయలు, కుంకుమ, పసుపు, బియ్యం, బొమ్మలు పెట్టి ఎవరో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు. కావాలని తమ ఇళ్ల ముందు పూజలు చేస్తున్నారని బాధితులు పేర్కొంటున్నారు. ఈ విషయమై గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.