అక్షరటుడే, కామారెడ్డి : హైదరాబాద్‌లో పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృత్యు ఒడికి చేరిన ఘటన చేగుంట వద్ద జరిగింది. గ్రామస్తులు, బంధువుల కథనం ప్రకారం.. చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన వడ్డేపల్లి వేణు(24), రంజిత్ ఇద్దరు కలిసి ఆదివారం హైదరాబాద్ వెళ్లారు. సోమవారం ఉదయం బైక్ పై వస్తుండగా.. మార్గమధ్యంలో చేగుంట వద్దకు రాగానే వెనుక నుంచి వస్తున్న డీసీఎం వ్యాను వేగంగా బైకును ఢీకొట్టింది. దీంతో వేణు అక్కడికక్కడే మృతి చెందగా రంజిత్ కు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదం విషయం తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.