అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: మద్యం మత్తులో మూత్ర విసర్జనకు వెళ్లి కింద పడి ఒకరు మృతి చెందిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కోటగల్లికి చెందిన శ్రీనివాస్(40) ఓ పెట్రోల్ బంకులో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే మంగళవారం రాత్రి మద్యం సేవించి ఐదో టౌన్ పరిధిలోని న్యాల్ కల్ కు వెళ్లే దారిలో రోడ్డు పక్కన మూత్ర విసర్జనకు వెళ్లాడు. మద్యం మత్తులో కింద పడిపోవడంతో మృతి చెందాడు. ఐదో టౌన్ ఎస్సై గంగాధర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.