అక్షరటుడే, బాన్సువాడ: కాలువలో పడి మహిళ మృతి చెందిన ఘటన బాన్సువాడ మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపేట మండలానికి చెందిన రాజమణి ఆదివారం బాన్సువాడ మండలం కొత్తబాది పంచాయతీ పరిధిలోని సంతోష్ నగర్ తండాకు వచ్చింది. బంధువుల ఇంటికి నడుస్తూ వెళ్తుండగా.. గ్రామ శివారులోని డిస్ట్రిబ్యూటర్-8 కాలువలో ఆదివారం సాయంత్రం పడి మృతి చెందింది. స్థానికులు కాలువలో మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.