అక్షరటుడే, ఇందూరు: వెజ్​బిర్యానీ ఆర్డర్​ చేస్తే.. అందులో చికెన్​ ముక్క వచ్చిన ఘటన నగరంలోని వంశీ ఇంటర్నేషనల్​ హోటల్​లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన సుధాకర్​రెడ్డి కుటుంబంతో కలిసి శుక్రవారం వంశీ హోటల్​కు వెళ్లాడు. రెస్టారెంట్​లో ​ వెజ్​బిర్యానీ ఆర్డర్​ చేశాడు. అయితే వెజ్​బిర్యానీలో చికెన్​ముక్క దర్శనమివ్వడంతో కస్టమర్​ అవాక్కయ్యాడు. అనంతరం సిబ్బందిని ప్రశ్నిస్తే.. పొరపాటున చికెన్​ ముక్క వచ్చిందని సర్దిచెప్పడం గమనార్హం.