అక్షరటుడే, బాన్సువాడ: జీవితంపై విరక్తితో చెట్టుకు ఉరేసుకొని ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బాన్సువాడ మండలంలో చోటు చేసుకుంది. సీఐ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దేశాయిపేట గ్రామానికి చెందిన బాలన్(66) కడుపు నొప్పితో జీవితంపై విరక్తి చెంది ఈనెల 24న ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం సోమేశ్వర్ శివారులోని ఓ పొలంలో చెట్టుకు ఉరేసుకొని మృతి చెందినట్లు స్థానికులు గుర్తించి సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.