అక్షరటుడే, జుక్కల్ : పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా గురువారం జుక్కల్ పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఉన్నత పాఠశాల విద్యార్థులకు వెపన్స్(ఆయుధాలు) పని తీరును వివరించారు. పోలీస్ సిబ్బంది విధులు, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 వినియోగించుకోవడం అనే అంశంపై సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎస్సై భువనేశ్వర్, ఏఎస్సై ప్రభాకర్, సిబ్బంది పాల్గొన్నారు.