అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై బోధన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం నిలిచిపోయింది. బస్సులో డీజిల్ అయిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. జీఎంఆర్ పెట్రోలింగ్ సిబ్బంది స్పందించి డీజిల్ తీసుకురావడంతో బస్సు హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లింది.