అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: గుర్తు తెలియని వృద్ధుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన డిచ్పల్లి–ఇందల్వాయి రైల్వే మార్గంలో చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి సదరు వ్యక్తి రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు.