అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన అంకాపూర్ రైల్వే బ్రిడ్జి వద్ద చోటు చేసుకుంది. బ్రిడ్జి వద్ద మృతదేహం ఉందన్న సమాచారం మేరకు మంగళవారం వెళ్లి పరిశీలించినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.