అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆస్పత్రి భవనంపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. చాట్ల లక్ష్మణ్‌(50) అనారోగ్య సమస్యతో నాలుగు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరాడు. కాగా.. మంగళవారం ఉదయం భవనంలోపల పైఅంతస్తు నుంచి దూకడంతో తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఒకటో టౌన్‌ ఎస్‌హెచ్‌వో రఘుపతి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.