అక్షరటుడే, జుక్కల్: నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజపల్లి శివారులో గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజపల్లి శ్మశాన వాటిక ప్రాంతంలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకున్నాడు. గురువారం సాయంత్రం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.