అక్షరటుడే, కామారెడ్డి: జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం చిరుతను ఢీకొన్న ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. చంద్రాయన్‌పల్లి – దగ్గి మధ్య హైవేపై చిరుతను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో కొద్దిసేపు చిరుత రోడ్డుపైనే కదలకుండా కూర్చుండిపోయింది. అనంతరం అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. చిరుతను చూసి ఆ దారి వెంట వెళ్లే ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.