అక్షరటుడే, ఇందల్వాయి: చికిత్స పొందుతూ గుర్తుతెలియని మహిళ(55) మృతి చెందినట్లు ఇందల్వాయి ఎస్ఐ మనోజ్ కుమార్ తెలిపారు. ఇందల్వాయి టోల్ ప్లాజావద్ద ఆమె రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టినట్లు పేర్కొన్నారు. చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. మరణించిందని చెప్పారు.