అక్షరటుడే, ఇందూరు: అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 12న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు యూనియన్ గౌరవాధ్యక్షుడు రమేశ్‌బాబు తెలిపారు. మంగళవారం జిల్లా శిశు, మహిళా సంక్షేమ శాఖ సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్‌వాడీ టీచర్లకు కనీస వేతనం నెలకు రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బెనిఫిట్స్‌లో భాగంగా టీచర్‌కు రూ. ఐదు లక్షలు, ఆయాకు రూ.మూడు లక్షలు ఇవ్వాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో యూనియన్ జిల్లా కార్యదర్శి స్వర్ణ, నాయకులు సందీప, సాజిదా, కవిత, సవిత పాల్గొన్నారు.