అయోధ్యలో రామ్‌లల్లా వార్షిక వేడుక

0

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఓ వైపు ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళాతో దేశం మొత్తం భక్తి తరంగంలో మునిగిపోయింది. మరోవైపు అయోధ్య రామాలయం వార్షిక వేడుక నిర్వహించుకుంటోంది. ఏడాది క్రితం ఇదే రోజు రామ్ లల్లా ప్రతిష్ఠించబడ్డారు. జనవరి 22, 2024 నుంచి అయోధ్య నగరానికి గణనీయమైన భక్తుల రద్దీని, పర్యాటకుల తాకిడి కొనసాగుతోంది.

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రంలో ఆగస్టు 5, 2020న రామ మందిర నిర్మణ ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ నిర్వహించారు. ఈ ఆలయ నిర్మాణాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షించింది. జనవరి 22, 2024న బాల రాముడు ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా నిర్వహించారు. మదురు రంగు కృష్ణ‌శిల‌పై రామ్ ల‌ల్లా 51 అంగుళాల పొడవుతో 5 ఏళ్ల బాలుడిలా విల్లు, బాణం పట్టుకుని దర్శనమిస్తున్నారు.