అక్షరటుడే, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో గురువారం మరో ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభమైంది. మార్కెట్‌ నుంచి రూ.2,497 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఇన్‌వెంచురస్‌ నాలెడ్జ్‌ సొల్యూషన్స్‌ కంపెనీ బిడ్లు ఆహ్వానిస్తోంది. ఈ ఐపీవోకు సబ్‌స్క్రైబ్‌ చేసుకోవడానికి 16వ తేదీ వరకు అవకాశం ఉంది. కంపెనీ ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ. 1,265 నుంచి రూ. 1,329గా నిర్ణయించింది. ఆసక్తి ఉన్నవారు కనీసం 11 షేర్ల కోసం రూ. 14,619 తో బిడ్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది. రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం 10 శాతం కోటా కేటాయించారు. ప్రస్తుతం ఈ కంపెనీకి గ్రే మార్కెట్‌ ప్రీమియం 30 శాతంగా ఉంది.