అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌కు చెందిన మరో సభ్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈవిషయాన్ని ఇస్కాన్‌ కోల్‌కతా ప్రతినిధి రాధారమణ్‌ దాస్‌ ఎక్స్‌వేదికగా తెలిపారు. ఇస్కాన్‌ సభ్యుడు శ్యాందాస్‌ ప్రభును ఎలాంటి వారెంట్‌ లేకుండా చటోగ్రాం పోలీసులు అరెస్టు చేశారు. ఎలాంటి నేరం చేయకుండానే అరెస్టు చేయడం దిగ్భ్రాంతిని కలిగించిందని పేర్కొన్నారు. బంగ్లాలోని ఇస్కాన్‌ సెంటర్‌ను కొందరు ధ్వంసం చేసినట్లు తెలిపారు. గతంలో ఇస్కాన్‌కు చెందిన ప్రచారకర్త చిన్మయ్‌ కృష్ణదాస్‌ బంగ్లాదేశ్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.