అక్షరటుడే, వెబ్‌డెస్క్: మెగా హీరో రామ్‌చరణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ నుంచి మరో కొత్త సాంగ్ రిలీజైంది. అమెరికాలోని డల్లాస్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్ వేడుక సందర్భంగా ‘దోప్’ పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోంది. కియార అడ్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.