అక్షరటుడే, ఆర్మూర్‌: రాష్ట్రానికి అవసరమైన నాణ్యమైన సోయా విత్తనాలను సరఫరా చేయాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేష్‌రెడ్డి పేర్కొన్నారు. రానున్న ఖరీఫ్‌ సీజన్‌లో సోయా విత్తనాల అవసరం నేపథ్యంలో ఈనెల 11,12 తేదీల్లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, భోపాల్‌లో ఆయన పర్యటించారు. ఈ మేరకు అక్కడి అధికారులతో సమావేశమై మాట్లాడారు. అనంతరం ఇండోర్‌లోని విత్తనశుద్ధి కర్మాగారాన్ని సందర్శించి విత్తన నాణ్యత, ప్రాసెసింగ్, ప్యాకింగ్‌ పరిశీలించారు.