అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి విజయం దిశగా దూసుకుపోతుంది. ఈసందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మహాయుతి కూటమి నాయకులకి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు అపూర్వ విజయం అందించబోతున్నారని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూటీ సీఎం దేవేందర్‌ ఫడ్నవీస్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు.