అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వడానికి వృత్తి శిక్షణ సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కృష్ణవేణి ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీ, ఎడ్యుకేషన్, హెల్త్, అకౌంటింగ్, కన్ స్ట్రక్షన్, వెటర్నరీ, డెయిరీ, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, హార్టికల్చర్, టూరిజం, డ్రైవింగ్, ఎలక్ట్రానిక్స్ తదితర కోర్సులో శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థతో అనుసంధానమై, రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలు అప్లై చేసుకోవాలన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న సంస్థలు నాంపల్లిలోని హజ్ హౌస్ ఐదో అంతస్తుల గల కార్యాలయంలో అక్టోబర్ 4లోపు దరఖాస్తు సమర్పించాలని సూచించారు.