అక్షరటుడే, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష యథాతథంగా నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. పరీక్ష వాయిదా వేయలేమని ప్రభుత్వానికి తెలిపింది. అయితే అభ్యర్థులు ఆందోళన చేసే అవకాశం ఉండడంతో ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.