అక్షరటుడే, ఆర్మూర్: నందిపేట మండలం ఉమ్మెడలోని అర్గుల్ రాజారాం గుత్ప ఎత్తిపోతల ద్వారా ఖరీఫ్ పంటకు నీటి విడుదలను ప్రారంభించారు. మంగళవారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేష్ రెడ్డిలు స్విచ్ఛ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. గుత్ప ఎత్తిపోతల నీళ్లు ఆర్మూర్, నందిపేట్, మాక్లూర్, ఆలూరు, వేల్పూర్, జక్రాన్ పల్లి మండలాల పరిధిలోని 34,650 ఎకరాలకు అందనున్నాయి. అనంతరం వారు ఉమ్మెడ గోదావరి బ్రిడ్జిపై భారీ గణనాథుల నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు సాయిరెడ్డి, రాజు, చిన్నయ్య, సాయికిరణ్, నీటిపారుదల శాఖ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.