అక్షరటుడే, ఆర్మూర్: పేదల ఉన్నతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి అన్నారు. ఆర్మూర్​ ఆరో వార్డులో గురువారం నిర్వహించిన వార్డు సభలో ఆయన మాట్లాడారు. ఆయా పథకాలకు ఎంపికైన వారి పేర్లను అధికారులు చదివారు. మరోవైపు జాబితాలో పేర్లు లేని వారి నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్​ సాయిబాబా గౌడ్, కొంతం మురళి, మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ లయన్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.