అక్షరటుడే, ఆర్మూర్: రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. హాస్టళ్లలో నెలకొన్న సమస్యలపై ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘గురుకుల వ్యవస్థ నిర్వీర్యానికి కాంగ్రెస్ కుట్ర పన్నిందా?.. అన్నం బదులు పురుగుల బువ్వ.. చదువులకు లేవు సౌలత్‌లు, కాలం చెల్లిన మందులతో నిర్లక్ష్యం.. వందమందికి ఒక టాయిలెట్.. పేద, మధ్యతరగతి పిల్లలకు విద్యను దూరం చేస్తరా?’ అంటూ మండిపడ్డారు. ‘ఎక్స్’ పోస్టుకు ప్రశ్నిస్తున్న తెలంగాణ హ్యష్ ట్యాగ్‌ను జతచేశారు.