అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. బల్దియా కార్యాలయంలో ఛైర్ పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అధ్యక్షతన సమావేశం జరగగా.. 30 ఎజెండా అంశాలపై కౌన్సిల్ సభ్యులతో ఏకగ్రీవ తీర్మానం చేశారు. అందరి సహకారంతో మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుందామని ఛైర్ పర్సన్ సూచించారు. కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ మున్ను, కౌన్సిలర్లు గంగమోహన్ చక్రు, రాము, ప్రసాద్, సాయి, కమిషనర్ రాజు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.