అక్షరటుడే, ఆర్మూర్: పట్టణ మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం వీగిపోయిందని వెలువడిన ప్రకటన వెనుక కుట్ర దాగి ఉందని బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నర్సింహారెడ్డి ఆరోపించారు. పట్టణంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అవిశ్వాసం ప్రవేశపెట్టిన సమయంలో 36 మందికి గాను 24 మందితో తీర్మానం నెగ్గిందన్నారు. ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు నమోదు చేసుకోలేదని పేర్కొన్నారు. కేవలం ఎమ్మెల్యే హోదాలోనే హాజరయ్యారన్నారు. కానీ అవిశ్వాసం వీగిపోయిందని ప్రిన్సిపల్ సెక్రెటరీ నుంచి ప్రకటన రావడం హాస్యాస్పదమన్నారు. తక్షణమే అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు గంగాధర్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.