ఆర్మూర్ అభివృద్ధికి కృషి చేస్తా

0

అక్షరటుడే, ఆర్మూర్: తాను ఓడిపోయినా తమ పార్టీ అధికారంలో ఉందని, ఆర్మూర్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జి ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి అన్నారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రెస్ క్లబ్ సభ్యులు తమ సమస్యలను వినయ్ రెడ్డికి తెలుపగా త్వరలోనే పరిష్కరిస్తానని హామీఇచ్చారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డిని జర్నలిస్టులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సాయిబాబా గౌడ్, జిమ్మి రవి, మురళి పాల్గొన్నారు.