అక్షరటుడే, ఆర్మూర్: ఆటో డ్రైవర్లు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని ఆర్మూర్ ట్రాఫిక్ సీఐ రమేష్ సూచించారు. ఆర్మూర్ బస్టాండ్ వద్ద మంగళవారం ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఆటోకు క్యూఆర్ కోడ్ ను ఏర్పాటు చేసుకోవాలని, డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు, ఇన్సూరెన్స్, యూనిఫామ్ తప్పనిసరన్నారు. ముఖ్యంగా ముందు సీట్లపై ప్యాసింజర్లను కూర్చో పెట్టవద్దని ఆదేశించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే సీజ్ చేస్తామని హెచ్చరించారు.