అక్షరటుడే, వెబ్​డెస్క్​: లిఫ్ట్​లో ఇరుక్కుని గాయపడ్డ బాలుడు ఆర్నవ్​ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. శుక్రవారం హైదరాబాద్​లోని మాసబ్​ట్యాంక్​ శాంతినగర్​ అపార్ట్​మెంట్​లోని లిఫ్ట్​లో బాలుడు ఆర్నవ్ చిక్కుకున్నాడు. దీంతో స్పందించిన ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది బాలుడిని బయటకు తీసి నీలోఫర్​కు తరలించారు. ఆస్పత్రిలో సర్జరీ చేసి వెంటిలేటర్​పై చికిత్స అందించినప్పటికీ బాలుడి ప్రాణం నిలువలేదు. పరిస్థితి విషమించి బాలుడు మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.​