అక్షరటుడే, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టీ20 సీజన్ 2025 మెగా వేలానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సౌదీ అరేబియాలో జెడ్డా నగరం వేదికగా ఆది, సోమ వారాల్లో ఈ మెగా వేలం పాట జరగనుంది. 577 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందు కోసం 204 స్లాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ వేలంలో రైట్ టు మ్యాచ్ పునరాగమనం కావడం గమనార్హం. ఫ్రాంచైజీలు తమ డ్రిమ్ స్క్వాడ్ల కోసం బరిలో దిగుతున్నాయి. ఈసారి రూ. రెండు కోట్ల రిజర్వ్ ధర కలిగిన క్రికెటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. భారత్‌కు చెందిన రిషబ్ పంత్, రాహుల్, అశ్విన్, ఇషాన్ కిషన్ తదితరులు ఆక్షన్ ఉంటున్నారు. విదేశాలకు చెందిన స్టార్ క్రికెటర్లు కూడా వేలంలో పాల్గొంటారు. ఈ మెగా వేలం కోసం బీసీసీఐ ఏర్పాట్లు చేసింది.