అక్షరటుడే, ఇందూరు: తెయూ పరిధిలోని పీజీ, ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల విద్యార్థులు ఈనెల 30లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని పరీక్షల విభాగం నియంత్రణ అధికారిణి అరుణ తెలిపారు. పీజీ ఫస్ట్, థర్డ్‌ సెమిస్టర్‌ రెగ్యులర్, ఎంఏ/ఎంఎస్‌డబ్ల్యూ /ఎంకాం/ఎంబీఏ/ఎంసీఏ/ఇంటిగ్రేటెడ్‌ కోర్సు, ఎల్‌ఎల్‌బీ ఫస్ట్‌ సెమిస్టర్‌తో పాటు ఐఎంబీఏ ఏడు, తొమ్మిదో సెమిస్టర్‌ పరీక్షల ఫీజులను అపరాధ రుసుం లేకుండా చెల్లించవచ్చని సూచించారు. రూ.100 అపరాధ రుసుముతో జనవరి 6 వరకు చెల్లించుకోవచ్చని, పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ సందర్శించాలని సూచించారు.