అక్షరటుడే, కామారెడ్డి: బీజేపీ సంస్థాగత మార్పుల్లో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల అధ్యక్షులను నియమించారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ కామారెడ్డి నియోజకవర్గాల పరిధిలోని 22 మండలాలకు నూతన అధ్యక్షులు నియమితులయ్యారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రకటన విడుదల చేశారు. నూతన అధ్యక్షుల నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అలాగే జిల్లా కౌన్సిల్​ మెంబర్​గా రుద్రూర్​కు చెందిన ప్రశాంత్​ గౌడ్​ నియమితులయ్యారు.

మండల అధ్యక్షులు వీరే..

బీర్కూర్ – నాగెళ్ల సాయికుమార్

రుద్రూర్ – హరికృష్ణ

చందూర్ – మడిశెట్టి విఠల్

మోస్రా – శ్రీకాంత్

కోటగిరి – ఏముల శ్రీనివాస్

ఎల్లారెడ్డి టౌన్ – రాజేశ్​

తాడ్వాయి – సంతోష్ రెడ్డి

లింగంపేట – క్రాంతి కుమార్

నాగిరెడ్డిపేట – శ్రీనివాస్

జుక్కల్ – మేత్రి బాలరాజు కుర్మ

బిచ్కుంద – విష్ణు

మద్నూర్ – తుకారం పటేల్

డోంగ్లీ – ధనుంజయ్ పాటిల్

మాచారెడ్డి – బూస సురేష్

పాల్వంచ – పోసు అనిల్

బీబీపేట – అల్లం ప్రవీణ్

దోమకొండ – భూపాల్ రెడ్డి

భిక్కనూరు – ఉప్పరి రమేశ్​

రాజంపేట – సంపత్ రెడ్డి

కామారెడ్డి రూరల్ – శ్రీధర్

కామారెడ్డి టౌన్ – మోటూరి శ్రీకాంత్