అక్షరటుడే, ఇందూరు: సమగ్ర కుల గణన చైతన్య యాత్రలో భాగంగా ఈ నెల 21న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ జిల్లా కేంద్రానికి విచ్చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ తెలిపారు. ఈ మేరకు నగరంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉదయం 11 గంటలకు చైతన్య సదస్సు ఉంటుందని తెలిపారు. అన్ని కులాల నాయకులతో మాట్లాడతారని పేర్కొన్నారు. కుల గణన తీరుతెన్నులను పరిశీలించడానికి ఒక గ్రామాన్ని సందర్శిస్తారని చెప్పారు. సమావేశంలో నాయకులు బుస్సా ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, గంగా కిషన్, రవీందర్, దేవేందర్, శంకర్, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.