అక్షరటుడే, ఇందూరు: భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని 21 మండలాలకు నూతన అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు పార్టీ జిల్లా ఎన్నికల అధికారి కాసం వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నియామకాలు సత్వరమే అమల్లోకి వస్తాయని ప్రకటించారు. కాగా.. నూతన అధ్యక్షుల నియామకాల్లో యువతకు ప్రాధాన్యత ఇచ్చారు. త్వరలోనే పూర్తి స్థాయి కమిటీలను ఎన్నుకోనున్నారు.