అక్షరటుడే, కామారెడ్డి: రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా వాహనదారులకు అధికారులు అవగాహన కల్పించారు. బుధవారం భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధారణ, సీట్ బెల్ట్ ధరించడంపై పలు సూచనలు చేశారు. వాహనదారులకు పూలు అందజేస్తూ ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.