అక్షరటుడే, జుక్కల్ : నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద కొనసాగుతుండటంతో ఐదు వరద గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 35,400 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా 39,000 క్యూసెక్కులను మంజీరలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17.195 టీఎంసీల నీరు నిల్వ ఉంది.