అక్షరటుడే, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం మెట్రో ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. నగరంలో మేడ్చల్ నుంచి శామీర్‌పేట వరకు మెట్రో పొడిగించాలని నిర్ణయించింది. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 23కి.మీ లైన్‌కు, జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ వరకు 22 కి.మీ లైన్ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు లైన్లకు సంబంధించి డీపీఆర్‌లు సిద్ధం చేసి మూడు నెలల్లోగా అనుమతి వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వానికి పంపాలని అధికారులకు సూచించింది.