అక్షరటుడే, ఇందూరు: జిల్లా విద్యాశాఖ అధికారిగా అశోక్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా డైట్ కళాశాలలో లెక్చరర్ గా, ఆసిఫాబాద్ జిల్లా డీఈవోగా విధులు నిర్వహించి బదిలీపై వచ్చిన సంగతి తెలిసిందే. జిల్లా విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, అవినీతి అక్రమాలకు తావు లేకుండా విద్యాశాఖను నడిపిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది, ఉపాధ్యాయ సంఘాల సభ్యులు ఆయనకు అభినందనలు తెలిపారు.