అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: సీసీ కెమెరాలతో నిఘావ్యవస్థ పటిష్టమవుతుందని ఏఎస్పీ చైతన్య రెడ్డి పేర్కొన్నారు. దోమకొండ పోలీస్ స్టేషన్లో శనివారం సీసీ కెమెరాల కంట్రోల్ రూం కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. గ్రామాల్లో, కాలనీలో ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ సంపత్ కుమార్, ఎస్సై సుబ్రహ్మణ్య చారి, గడి సీనియర్ మేనేజర్ బాబ్జి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.