అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: సెంట్రల్ స్వీడన్‌లోని ఒక వయోజన విద్యా కేంద్రంలో మంగళవారం జరిగిన కాల్పుల్లో దుండగుడు సహా దాదాపు 10 మంది మరణించారని వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది. మధ్యాహ్నం 12.33 గంటలకు(భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.03) పాఠశాలలో కాల్పుల గురించి సమాచారం అందినట్లు ఒరెబ్రో పోలీసు చీఫ్ రాబర్టో ఈద్ ఫారెస్ట్ పేర్కొన్నారు. కానీ అది ఎలా జరిగిందో, పాఠశాల లోపలా? లేక వెలుపల జరిగిందో పేర్కొనలేకపోయారు. స్టాక్‌హోమ్‌కు పశ్చిమాన 200 కిలోమీటర్ల (125 మైళ్ళు) దూరంలో ఉన్న ఒరెబ్రో నగర శివార్లలో ఈ కాల్పులు జరిగాయి.