అక్షరటుడే, ఇందూరు: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని రాజారాం స్టేడియంలో అండర్ 8, 10, 12 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ నిర్వహించారు. అండర్-8 బాలికల విభాగంలో జిల్లా ఓవరాల్ ఛాంపియన్ గా విజయ పబ్లిక్ స్కూల్, బాలుర విభాగంలో లిటిల్ ఫ్లవర్ హైస్కూల్(నందిపేట్) నిలిచాయి. అండర్-10 బాలుర విభాగంలో విజయ్ హైస్కూల్, బాలికల విభాగంలో హంస వాహిని పాఠశాల(ధర్పల్లి) విజయం సాధించాయి. అండర్-12 బాలుర విభాగంలో టీఎస్ డబ్ల్యూఆర్ఎస్(ఆర్మూర్), బాలికల విభాగంలో విశ్వవికాస్ ఓవరాల్ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకున్నాయి. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నరాల రత్నాకర్, రాజా గౌడ్, ట్రస్మా సలహాదారుడు మోహన్, అధ్యక్షుడు నిత్యానంద్, ప్రధాన కార్యదర్శి అరుణ్, పట్టణాధ్యక్షుడు ధర్మరాజు, ఆయా పాఠశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.